తారక్ పుట్టినరోజున సూపర్ ట్రీట్.. రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఆ క్రేజీ మూవీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-26 12:02:35  IST  )

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన ఊసరవెల్లి చిత్రానికి సంబంధించిన స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారు.

తారక్ పుట్టినరోజున సూపర్ ట్రీట్.. రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఆ క్రేజీ మూవీ
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం ఊసరవెల్లి అనే చిత్రంలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో హీరోయిన్‌గా నటించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 2011వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాలోని తారక్, తమన్నా నటనలకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు.

ఇకపోతే గత కొంతకాలంగా స్టార్ హీరోల పుట్టినరోజులు వచ్చాయి అంటే వారికి సంబంధించిన సినిమాలను రీ రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. అందులో భాగంగా ఈ ఏడాది జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన ఊసరవెల్లి చిత్రానికి సంబంధించిన స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా మేకర్స్ విడుదల చేశారు. మరి ఈ మూవీ స్పెషల్ షోల ద్వారా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.

'కర' తెలుగు ట్రైలర్ లాంచ్ వేదిక ఖరారు.

Next Story