- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కర' తెలుగు ట్రైలర్ లాంచ్ వేదిక ఖరారు.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కర' చిత్రాన్ని ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులో కూడా అదే తేదీన విడుదల చేయనున్నారు. దీంతో ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. ఈ రోజు విడుదల కాబోయే ట్రైలర్ బాగుంటే, ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు, కేఎస్ రవికుమార్, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.






