బాలయ్య ఫ్యాన్స్ కు మరో షాక్... ఈ ఏడాది అఖండ 2 కష్టమేనా?

by velandi.Saikiran |   (  Updated:2025-12-06 01:56:57  IST  )

అఖండ 2 వచ్చే సంవత్సరంలోనే రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బుక్ మై షోలో 2026 లోనే

బాలయ్య ఫ్యాన్స్ కు మరో షాక్... ఈ ఏడాది అఖండ 2 కష్టమేనా?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య నటించిన ఆఖండ 2 సినిమాకు లైన్ క్లియర్ కావడం లేదు. మొన్నటి నుంచి ఈ సినిమా రిలీజ్ పైన ఎలాంటి క్లారిటీ రావడం లేదు. 14 రీల్స్ ప్లస్ పాత బకాయిల నేపథ్యంలో ఈ సినిమా అర్ధాంతరంగా వాయిదా పడింది. దీంతో నందమూరి బాలయ్య అభిమానులు డీలా పడిపోయారు. అయితే ఈ పెద్ద తప్పిదం పట్ల తాజాగా 14 రీల్స్ ప్లస్ స్పందిస్తూ పోస్ట్ కూడా పెట్టింది. నందమూరి బాలయ్య అభిమానులకు క్షమాపణలు చెప్పింది. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.

అయితే ఈ నేపథ్యంలో అఖండ 2 వచ్చే సంవత్సరంలోనే రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బుక్ మై షోలో 2026 లోనే అఖండ 2 రిలీజ్ అని చూపిస్తోందట. దీంతో ఈ ఏడాది కష్టమేనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం డిసెంబరు 12వ తేదీ లేదా 25వ తేదీలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రెండు తేదీలు మిస్ అయితే, సంక్రాంతి బరిలో అఖండ 2 ఉండనుంది. ఆ సమయంలో సినిమా రిలీజ్ అయితే, కలెక్షన్స్ భారీగా తగ్గే ప్రమాదం పొంచి ఉన్నట్లు సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. ఇక అటు సినిమా వాయిదా పడడంపై నందమూరి బాలయ్య చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

Read More..

అఖండ 2 వివాదంపై 14 రీల్స్ ప్ల‌స్ షాకింగ్ ట్వీట్‌

Next Story