కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్

by I. Sairam |   (  Updated:2026-02-06 07:51:01  IST  )

‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’(Ichata Vahanamulu Niluparadhu) సినిమాతో తెలుగు ఆడియ‌న్స్ కు ప‌రిచ‌య‌మైన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌద‌రి(Meenakshi Chaudhary) మనందరికీ సుపరిచితమే.

కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’(Ichata Vahanamulu Niluparadhu) సినిమాతో తెలుగు ఆడియ‌న్స్ కు ప‌రిచ‌య‌మైన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌద‌రి(Meenakshi Chaudhary) మనందరికీ సుపరిచితమే. ఆ త‌ర్వాత ‘హిట్:ది సెకెండ్ కేస్’(Hit:The Second Case), ‘గుంటూరు కారం’(Gunturu Karam), ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar), ‘గోట్:ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(GOAT), ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam), ‘అనగనగా ఒక రాజు’(Anaganaga Oka Raju) వంటి సినిమాలతో ఈ భామ మంచి హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అలా దాదాపు అన్ని సినిమాలు హిట్ కావడంతో అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. తాను న‌టించిన సినిమాల‌న్నీ మంచి స‌క్సెస్ అవుతున్న నేప‌థ్యంలో మీనాక్షి ల‌క్కీ హీరోయిన్ అయిపోయింది.

రీసెంట్‌గా నటించిన 'అనగనగా ఒకరాజు' మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) హీరోగా నటించిన ఈ చిత్రానికి మారి(Mari) దర్శకత్వం వహించాడు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన 'ఎన్‌సీ-24'(NC-24) మూవీతో పాటు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) సరసన ఓ సినిమాలో యాక్ట్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. శుక్ర‌వారం ఉద‌యం అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలిన‌డ‌క‌న తిరుమ‌ల (Tirumala) కు చేరుకుంది. పాదాల మండ‌పం వ‌ద్ద కొబ్బ‌రి కాయ‌లు కొట్టి మొక్కులు చెల్లించింది. అనంత‌రం వీఐపీ ద‌ర్శ‌నంలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ద‌ర్శ‌నం అనంత‌రం మీనాక్షి అభిమానుల‌తో స‌ర‌దాగా న‌వ్వుతూ మాట్లాడి అక్క‌డి అడిగిన వారికి సెల్ఫీలు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

ఆ భ్రమలో ఉన్నాను.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్

Next Story