- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ భ్రమలో ఉన్నాను.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ‘ఊహలు గుసగుసలాడే’(OOhalu Gusagusalade) సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మంచి స్టార్ డమ్ అందుకుంది. ఇక చివరగా ఈ అమ్మడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu Kada) మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singh) మూవీలో నటిస్తోంది. దీనికి హరీష్ శంకర్(Hereesh Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. ఇక ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలో తాజాగా రాశీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ చిన్నది ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది. మెడకు బ్లాక్ పెంటెండ్ ఉన్న చైన్‌తో బోల్డ్ స్టిల్స్ ఇచ్చింది. మినిమల్ మేకప్‌తో ఎలిగెంట్‌గా కనిపించింది. ఇక వాటికి.. ‘ఆ భ్రమల రాజభవనం’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈపోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ఫైర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘‘ఆస్తులు, హోదా ముఖ్యం కాదు.. నాకు కావాల్సింది అది మాత్రమే’’.. కాబోయే భర్తకు దివి షాకింగ్ కండీషన్లు !






