రాజు వెడ్స్ రాంబాయి హీరోతో రొమాన్స్ చేయబోతున్న స్టార్ హీరోయిన్..? ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

by I. Sairam |   (  Updated:2025-12-28 06:54:16  IST  )

‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju Weds Rambai) సినిమాతో మంచి విజయం సాధించిన యంగ్ హీరో అఖిల్ రాజ్(Akhil Raj) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

రాజు వెడ్స్ రాంబాయి హీరోతో రొమాన్స్ చేయబోతున్న స్టార్ హీరోయిన్..? ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju Weds Rambai) సినిమాతో మంచి విజయం సాధించిన యంగ్ హీరో అఖిల్ రాజ్(Akhil Raj) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో రాజు పాత్రతో మన పక్కింటి అబ్బాయి అన్నట్లుగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో అతనికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా రీసెంట్‌గా హెబ్బా పటేల్(Hebah Patel) హీరోయిన్‌గా నటించిన ‘ఈషా;(Eesha) సినిమాలో నటించాడు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతుంది.

అలా వరుస హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటున్న అఖిల్ రాజ్‌కు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి తెరకెక్కించనున్న కొత్త సినిమాలో అతడు హీరోగా నటించనున్నాడట. అయితే ఇందులో కథానాయికగా స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించనుందట.

అయితే ఈ సినిమాను ప్యూర్ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించనున్నట్లు సమాచారం. కానీ దర్శకుడు ఎవరన్నది ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా, కథకు మాత్రం అఖిల్ రాజ్ ఇప్పటికే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాక్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనిపై ఫ్యాన్స్, నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read More..

స్టార్ డైరెక్టర్‌తో యంగ్ హీరో రోషన్ సినిమా..? బొమ్మ అదిరిపోవాల్సిందే అంటూ కామెంట్స్

Next Story