శ్రీకాంత్ ఓదెల మాస్ బీభత్సం.. ది ప్యారడైజ్‌కు చిరంజీవి సినిమాతో లింక్?

by Pulgam srinivas |   (  Updated:2026-06-01 06:19:45  IST  )

శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ కథకు, తర్వాత చిరంజీవితో చేయబోయే సినిమాకు ఇంటర్‌లింక్ ఉండబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

శ్రీకాంత్ ఓదెల మాస్ బీభత్సం.. ది ప్యారడైజ్‌కు చిరంజీవి సినిమాతో లింక్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద శిష్యుడిగా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల, నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్, ప్రస్తుతం నాని హీరోగా ది ప్యారడైజ్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ది ప్యారడైజ్ షూటింగ్ ప్రారంభానికి ముందే మెగాస్టార్ చిరంజీవితో కూడా శ్రీకాంత్ ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ది ప్యారడైజ్ విడుదలైన అనంతరం చిరంజీవితో సినిమా ప్రారంభించే ఆలోచనలో శ్రీకాంత్ ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ది ప్యారడైజ్ మరియు శ్రీకాంత్ తదుపరి చేయబోయే చిరంజీవి సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ కథకు, తర్వాత చిరంజీవితో చేయబోయే సినిమా కథకు ఇంటర్‌ లింక్ ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా, ది ప్యారడైజ్ క్లైమాక్స్‌లోనే చిరంజీవి సినిమాకు సంబంధించిన లీడ్ కూడా ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ది ప్యారడైజ్ చిత్రానికి ప్రీక్వెల్‌ను కూడా శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నాని – చిరంజీవి సినిమాల కథలకు ఇంటర్‌లింక్ ఉంటుందనే వార్తలు బయటకు రావడంతో ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అదే సమయంలో చిరంజీవి ప్రాజెక్ట్‌పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

రవితేజ ‘ఇరుముడి’ నుంచి బిగ్ అప్‌డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

Next Story