రవితేజ ‘ఇరుముడి’ నుంచి బిగ్ అప్‌డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

by Pulgam srinivas |   (  Updated:2026-06-01 06:20:31  IST  )

రవితేజ హీరోగా నటిస్తున్న ఇరుముడి సినిమా గ్లింప్స్‌ను “ది హార్ట్ ఆఫ్ ఇరుముడి” పేరుతో జూన్ 3, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

రవితేజ ‘ఇరుముడి’ నుంచి బిగ్ అప్‌డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఇరుముడి అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇస్తూ మూవీ బృందం ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. “ది హార్ట్ ఆఫ్ ఇరుముడి” పేరుతో ఈ సినిమా గ్లింప్స్‌ను జూన్ 3, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఓ వ్యక్తి, చిన్నారి కలిసి ఎత్తైన ప్రదేశంలో కూర్చున్న దృశ్యం కనిపిస్తోంది.

ఈ విజువల్ సినిమాకు ఎమోషనల్ టచ్ ఉండబోతుందనే సంకేతాలను ఇస్తోంది. పోస్టర్‌ను బట్టి చూస్తే ఇరుముడి సినిమాలో యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ నెలకొనగా, జూన్ 3న విడుదల కానున్న గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే మూవీపై మరింత హైప్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శ్రీకాంత్ ఓదెల మాస్ బీభత్సం.. ది ప్యారడైజ్‌కు చిరంజీవి సినిమాతో లింక్?

Next Story