- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిబ్రవరి 6న ‘శ్రీ చిదంబరం గారు’ విడుదల
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’.

దిశ, సినిమా : శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు బచ్చిబాబు సానా విడుదల చేశారు. ఫిబ్రవరి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్‌ను గమనిస్తే.. మూవీ ఓ ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. ఈ కథలో కమర్షియల్ మేసేజ్‌తో పాటు ఓ బ్యూటిఫుల్ మేసేజ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో నేచురల్‌గా ఉంది. నిర్మాత మాట్లాడుతూ.. ‘అంతా కొత్తవాళ్లతో తీసిన బ్యూటిఫుల్ సినిమా ఇది. చాలా మెచ్యూర్డ్ అండ్ ఇన్‌స్పిరేషన్ స్టోరీతో రాబోతున్న సినిమా. నేటి సమాజానికి ఎంతో అవసరమైన కథ. చాలా మంది యువత చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కే సూసైడ్ వరకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారికి ఎంతో ఇన్‌స్పయిర్ అయ్యే కథ. మీలో లోపం మీకు బలం అవ్వాలి అని చెప్పే కథ ఇది. తప్పకుండా ఈ సినిమా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.






