- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కపుల్ ఫ్రెండ్లీ సాంగ్.. గాబరా గాబరా సోదరా..
సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మిస్తోంది.

దిశ, సినిమా : సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా నుంచి ‘గాబరా గాబరా’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రాకేందు మౌళి లిరిక్స్ రాయగా, ఆదిత్య రవీంద్రన్ కంపోజ్ చేసిన పాటను.. సంతోష్ నారాయణన్ పాడారు. ‘గాబరా గాబరా సోదరా లైఫ్ మొత్తం, కాలమే తన్నెరా లక్‌ను ఆమడ దూరం’ అంటూ కలిసి రాని లైఫ్‌కు ఫేట్ ఇచ్చే ట్విస్ట్‌లు ఎలా ఉంటాయో చూపిస్తూ ఈ పాట సాగుతుంది.






