చిన్నారి అభిమానిపై శ్రీలీల ప్రేమ..వీడియో వైరల్

by velandi.Saikiran |   (  Updated:2026-05-26 05:24:44  IST  )

ఓ అవార్డు వేడుకలో భాగంగా శ్రీలీల దగ్గరకు వచ్చిన చిన్నారి అభిమాని ఆమెకు గులాబీ పువ్వును బహుకరించింది.

చిన్నారి అభిమానిపై శ్రీలీల ప్రేమ..వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే ఇందులో కొంత మంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రీలీల, ఇక వెనక్కి చూసుకోలేదు. బడా హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తోంది. అయితే అలాంటి హీరోయిన్ శ్రీలీల... తన సున్నిత మనసుతో అందరి హృదయాలను గెలుస్తుంది. ఓ అవార్డు వేడుకలో భాగంగా శ్రీలీల దగ్గరకు వచ్చిన చిన్నారి అభిమాని.. ఆమెకు గులాబీ పువ్వు ఇచ్చింది.

ఇక ఆ చిన్నారిని చూసిన శ్రీలీల, వెంటనే కిందకు వంగి కూర్చొని... ఎంతో ప్రేమగా ఆ పువ్వును అందుకున్నారు. అనంతరం ఆ చిన్నారికి స్పెషల్ థాంక్స్ చెప్పి, ఫోటో దిగారు. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా, శ్రీలీల - క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ ప్రేమ‌లో ఉన్నార‌ని మొన్న‌టి నుంచి వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఏడాది కాలంగా సీక్రెట్ డేటింగ్ చేసుకుంటున్నార‌ని కూడా ప్ర‌చారం జోరందుకుంది. అలాంటిదేమీ లేద‌ని శ్రీలీల టీమ్ ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ.. వార్త‌లు మాత్రం వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.

భ‌ర్త ముందే స‌మంత‌కు ప్ర‌పోజ్ ?

Next Story