- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త ముందే సమంతకు ప్రపోజ్ ?
భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత లేటెస్ట్ గా నటించిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో సోమవారం హైదరాబాద్ లో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోర్ కూడా పాల్గొని సందడి చేశారు. అయితే సమంత వచ్చిన ఈ ఈవెంట్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో రాజ్ నిడిమోర్ స్టేజ్ పై మాట్లాడుతుండగా... ఓ అభిమాని ఒక్కసారిగా సమంత దగ్గరికి వచ్చాడు. తన చేతిలో ఉన్న పూల బొకేను హీరోయిన్ సమంతకు ఇచ్చి, తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ప్రియురాలికి ప్రపోజ్ చేసినట్లుగానే, మోకాళ్లపై నిలబడి హీరోయిన్ సమంతకు బొకే అందించాడు. ఆ తర్వాత హీరోయిన్ సమంతతో సెల్ఫీ కూడా దిగాడు. అయితే ఇంత జరుగుతున్నా రాజ్ నిడిమోర్ మాత్రం చాలా కూల్ గా వ్యవహరించారు. అటు సమంత కూడా కోపం తెచ్చుకోకుండా, సెల్ఫీ దిగిన తర్వాత అతన్ని పంపించేసింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సమంత భర్త రాజ్ నిడిమోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీత స్వరాలు అందించారు.






