‘నేను రెడీ’తో తెలుగు ఎంట్రీకి రెడీ అంటున్న హాటెస్ట్ బ్యూటీ.. యూత్‌ను ఆకర్షిస్తున్న పోస్టర్

by Chukka Sudharani |   (  Updated:2026-05-16 16:19:41  IST  )

యంగ్ హీరో హవీష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘నేను రెడీ’.

‘నేను రెడీ’తో తెలుగు ఎంట్రీకి రెడీ అంటున్న హాటెస్ట్ బ్యూటీ.. యూత్‌ను ఆకర్షిస్తున్న పోస్టర్
X

దిశ, సినిమా: యంగ్ హీరో హవీష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘నేను రెడీ’. సినిమా చూపిస్తా మామా, నేను లోకల్, ధమాకా, మజాకా వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తన్న ఈ మూవీ నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ తెలుగులోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. తన అద్భుతమైన గ్లామర్, ఆకట్టుకునే ప్రజెన్స్‌తో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నర్గీస్, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఇస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో నర్గీస్ ఫఖ్రీ మెరిసే వెండి రంగు దుస్తులలో, కొవ్వొత్తులతో వెలిగే ఒక అద్భుతమైన బ్యాక్ డ్రాప్‌లో రొమాంటిక్ ఫోజుతో కనిపించి యూత్‌ను ఆకర్షిస్తుంది. సాంగ్ అనౌన్స్‌మెంట్ త్వరలో ఇస్తామంటూ షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రజెంట్ నెట్టింట వైరల్‌గా మారింది.

మెగాస్టార్‌ను కలిసిన రేణు దేశాయ్.. నెట్టింట ఎమోషనల్ పోస్ట్

Next Story