- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్‌ను కలిసిన రేణు దేశాయ్.. నెట్టింట ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్‌ను కలవడం తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని చెబుతూ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

దిశ, సినిమా: ఒకప్పుడు నటిగా గుర్తింపు తెచ్చుకుని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పెళ్లి, పిల్లలు, విడాకుల తర్వాత ఇంటికే పరిమితం అయిన నటి రేణు దేశాయ్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాలు చేస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ మూగజీవాల కోసం ఎన్జీవో నడుపుతూ వాటికోసం పోరాడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ నటి తన ఇన్‌స్టా వేదికగా ఓ రేర్ పిక్‌ను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్‌ను షేర్ చేసింది. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ అయిన మమ్ముట్టిని కలిసిన ఈమె.. ఆ ఫొటోను పంచుకుంటూ.. ‘నాకు ఇది ఒక పిచ్చెక్కిన అభిమాన క్షణం... మమ్ముట్టి సార్‌ను కలవడం, ఆయనతో కొంత సమయం గడపడం నా జీవితంలో చేయాలనుకున్న పనుల్లో ఒకటి. అది ఎట్టకేలకు నిజమైంది. ఒక వీరాభిమానిగా నా హృదయం, ఆత్మ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. నేను ఇప్పటివరకు కలిసిన వారిలో ఆయన అత్యంత ప్రతిభావంతుడు, వినయశీలి, తెలివైనవాడు అలాగే దయగల వ్యక్తి’ అంటూ ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లింక్
- Tags
- Renu Desai






