- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డ్రాగన్’లో స్పెషల్ సాంగ్.. ప్రశాంత్ నీల్ సూపర్ ప్లాన్
‘డ్రాగన్’ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు మంచి స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ సాంగ్‌ను స్టార్ హీరోయిన్‌తో చిత్రీకరించాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి ఇప్పటివరకు అధికారికంగా టైటిల్ ఖరారు చేయలేదు. అయితే ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌కు మంచి స్కోప్ ఉందని, అందుకే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఐటెమ్ సాంగ్‌ను చిత్రీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తారక్ లాంటి స్టార్ హీరో పక్కన మామూలు క్రేజ్ ఉన్న హీరోయిన్ సరిపోదనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న ఓ స్టార్ బ్యూటీని ఈ సాంగ్ కోసం తీసుకురావాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తారక్ అద్భుతమైన డాన్స్‌కు తగ్గట్టుగా అదే స్థాయిలో డాన్స్ చేసే హీరోయిన్ అయితేనే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తారో చూడాలి.
ఆదర్శ కుటుంబం నుండి అదిరిపోయే అప్‌డేట్.. జెట్ స్పీడ్‌లో త్రివిక్రమ్






