ఆదర్శ కుటుంబం నుండి అదిరిపోయే అప్‌డేట్.. జెట్ స్పీడ్‌లో త్రివిక్రమ్

by Pulgam srinivas |   (  Updated:2026-05-03 09:27:07  IST  )

తాజాగా ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.

ఆదర్శ కుటుంబం నుండి అదిరిపోయే అప్‌డేట్.. జెట్ స్పీడ్‌లో త్రివిక్రమ్
X

దిశ, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ చిత్ర చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రారంభంలో ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌ను ఎంపిక చేసినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా, ఆయన స్థానంలో ఎస్‌.ఎస్‌. తమన్‌ను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు త్రివిక్రమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా మేజర్ షూటింగ్ పూర్తయినట్టే అని తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. మిగిలిన షూటింగ్‌ను కూడా త్వరలో పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

‘డ్రాగన్’లో స్పెషల్ సాంగ్.. ప్రశాంత్ నీల్ సూపర్ ప్లాన్

Next Story