- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ ‘పెద్ది’కి అద్భుత అవకాశం.. టాక్ బాగుంటే కలెక్షన్ల వర్షం గ్యారెంటీ
ఆంధ్రప్రదేశ్‌లో ‘పెద్ది’ ప్రీమియర్ షోలకు అలాగే విడుదలైన అనంతరం 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకేక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, వృద్ధి సినిమాస్ బ్యానర్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. విడుదలకు ఒక్కరోజు ముందుగా, అంటే జూన్ 3న ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ‘పెద్ది’ ప్రీమియర్ షోలకు అనుమతినిస్తూ, అలాగే 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది.
అందుకు సంబంధించిన ధరలను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న స్పెషల్ ప్రీమియర్ షోలకు టికెట్ ధరను రూ.600 (జీఎస్టీతో కలిపి నిర్ణయించారు. అలాగే సినిమా విడుదలయ్యే జూన్ 4 నుంచి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 అదనంగా టికెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా, విడుదలైన తొలి ఐదు రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.






