- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ మూవీకి ఏపీ సర్కార్ బంపరాఫర్.. టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddhi) మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు, అలాగే ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చుకునేందుకు అనుమతిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో మొదటి 10 రోజుల పాటు ప్రతి టికెట్‌పై రూ.100 చొప్పున పెంచుకునేందుకు అనుమతి లభించింది. అదేవిధంగా మల్టీప్లెక్స్‌లలో మొదటి 10 రోజుల పాటు ప్రతి టికెట్‌పై రూ.125 చొప్పున పెంచుకునేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంసింది. అదేవిధంగా ప్రత్యేక ప్రీమియర్ షో టికెట్ ధరను అత్యధికంగా రూ.600గా ప్రభుత్వం నిర్ణయించింది.
రోజుకు 5 షోలకు పర్మీషన్..
టికెట్ ధరల పెంపుతో పాటు, కలెక్షన్ల వర్షం కురిపించేందుకు వీలుగా రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణంగా రోజుకు 4 షోలు మాత్రమే ప్రదర్శించే వీలుండగా, ‘పెద్ది’ చిత్రానికి ప్రత్యేకంగా మరో షోను అదనంగా కేటాయించింది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో చిత్ర నిర్మాతలకు, బయ్యర్లకు భారీ ఊరట లభించినట్లయింది.






