తెలుగు మాట్లాడటం ఒకెత్తయితే.. కెమెరా ముందు డైలాగ్‌ చెప్పడం మరో ఎత్తు.. గ్లోబల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2026-02-09 06:05:59  IST  )

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగు మాట్లాడటం ఒకెత్తయితే.. కెమెరా ముందు డైలాగ్‌ చెప్పడం మరో ఎత్తు.. గ్లోబల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి(SS Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'వారణాసి'(Varanasi) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో రుద్రగా మహేష్ బాబు, మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్(Prudhvi Sukumaran) కనిపించనున్నారు. ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ భారీ స్టార్ కాస్టింగ్‌తో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ ఆధారంగా 'వారణాసి'ను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రబృందం ఓ నేషనల్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా గ్లోబల్ బ్యూటీను ‘తెలుగుభాషతో మీ ప్రయాణం ఎలా ఉంది?’ అని అడుగగా.. దానికి ఆమె స్పందిస్తూ.. ‘నాకు తెలుగు అస్సలు రాదు.

నిజానికి తెలుగు భాష నేర్చుకోవడం చాలా కష్టం. మామూలుగా మాట్లాడటం ఒకెత్తయితే.. కెమెరా ముందు డైలాగ్‌ చెప్పడం మరో ఎత్తు. అందుకే ఈ విషయంలో రాజమౌళి హెల్ప్‌ తీసుకుంటున్నా. ఆయన నాకు డైలాగ్‌ అర్థం చెబుతారు. పాత్ర ఇన్‌టెన్షన్‌ని వివరిస్తారు. దాన్ని బట్టి ఓ పదినిమిషాలు దానిపై వర్క్‌ చేసి, అప్పుడు నా ైస్టెల్‌లో నేను డైలాగ్‌ చెప్తున్నా. నిజానికి అది అంత ఈజీ కాదు. అందరి సహకారం వల్లే అది సాధ్యమవుతోంది.’ అంటూ సమాధానమిచ్చింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఆ సినిమాకు డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న హీరోయిన్.. డైరెక్టర్‌తో ఉన్న ఫొటోస్‌ షేర్ చేయడంతో వైరల్

ఆ సినిమాకు డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న హీరోయిన్.. డైరెక్టర్‌తో ఉన్న ఫొటోస్‌ షేర్ చేయడంతో వైరల్

Next Story