- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమాకు డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న హీరోయిన్.. డైరెక్టర్‌తో ఉన్న ఫొటోస్ షేర్ చేయడంతో వైరల్
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ఈ చిన్నది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singh) మూవీలో నటిస్తోంది. దీనికి హరీష్ శంకర్(Hareesh Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా రాశీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. షేర్ చేసిన ఫొటోస్‌లో డబ్బింగ్ రూమ్‌లో డైలాగ్స్ పేపర్ పట్టుకున్న ఫొటోస్‌తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్‌తో తీసుకున్న అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ బుక్ పట్టుకున్న ఫొటోలు ఉన్నాయి. ఇక వీటికి.. ‘డబ్బింగ్ ప్రారంభమైనప్పుడు, కౌంట్‌డౌన్ నిజమైనదిగా అనిపిస్తుంది. దాదాపు పూర్తయింది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీతో పాటు హార్ట్ సింబల్ జోడిస్తున్నారు. మరి కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేసేయండి.






