- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారంలో జాతరలో టాలీవుడ్ నిర్మాత..ఫోటోలు వైరల్
మహా మేడారం జాతరకు టాలీవుడ్ నిర్మాత SKN ( Sreenivasa Kumar Naidu) కూడా వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మహా జాతర మేడారం సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మహా జాతర నిర్వహిస్తారు. కుంభమేళ తరహాలోనే ఈ జాతర కొనసాగుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా ఏర్పాట్లు చేసింది. జనాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక నిన్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా మేడారంలోనే నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం తన కుటుంబ సభ్యుల తో కలిసి మేడారం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎత్తు బంగారం కూడా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
మేడారంలో టాలీవుడ్ నిర్మాత SKN
మహా మేడారం జాతరకు టాలీవుడ్ నిర్మాత SKN ( Sreenivasa Kumar Naidu) కూడా వెళ్లారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కాకుండా... స్నేహితులతో ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకొని, ఫోటోలు దిగారు నిర్మాత SKN. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయమే ఈ మేడారం జాతర అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి పండుగలు తెలంగాణలో జరగడం గర్వకారణం అని కొనియాడారు SKN. అటు దిల్ రాజు కూడా మేడారంలో సందడి చేశారు.
Read More..






