బర్త్‌డే స్పెషల్.. కార్తీ ‘సర్దార్ 2’ నుంచి సూర్య స్పెషల్ పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |   (  Updated:2026-07-20 17:05:21  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2'.

బర్త్‌డే స్పెషల్.. కార్తీ ‘సర్దార్ 2’ నుంచి సూర్య స్పెషల్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2'. 2022లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘సర్దార్’కు సీక్వెల్‌గా రాబోతున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకోగా.. 2026 సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీనికి పి.ఎస్. మిథ్రాన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో కార్తీ ద్విపాత్రాభినయం (తండ్రి సర్దార్ అండ్ కొడుకు ఇన్‌స్పెక్టర్ విజయ్) చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో ఎస్.జె. సూర్య, మాళవికా మోహనన్, యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఎస్.జె సూర్య స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్. ఈ రోజు ఆయన బర్త్‌డే కావడంతో సూర్యకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటోంది.

టాక్సిక్ నుంచి మరో సర్‌ప్రైజ్.. బోల్డ్ పోస్టర్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీ

Next Story