టాక్సిక్ నుంచి మరో సర్‌ప్రైజ్.. బోల్డ్ పోస్టర్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీ

by Chukka Sudharani |

రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో, గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నమోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’.

టాక్సిక్ నుంచి మరో సర్‌ప్రైజ్.. బోల్డ్ పోస్టర్‌తో సినిమాపై మరింత క్యూరియాసిటీ
X

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో, గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నమోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా.. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్.కె నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా.. గ్లింప్స్, ట్రైలర్, లేడీస్ అండ్ లేడీస్ స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి.

వీటితో పాటు.. మొదటి పాట ‘తబాహి’ వీడియో సాంగ్ వైరల్ అవ్వడంతో పాటు బోల్డ్ నెస్ ఎక్కువ ఉందని ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంది. ఈ సాంగ్‌లో యష్, కియారా అద్వానీల మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే.. ఈ పాటతోనే బోల్డ్ అండ్ రొమాన్స్‌ను పరిచయం చేసిన టీమ్.. ఇప్పుడు సెకండ్ సింగిల్ అప్డేట్‌తో మరింత హైప్ పెంచారు. ఈ మేరకు ఓ బోల్డ్ పోస్టర్‌ను బ్లర్‌గా షేర్ చేస్తూ.. ‘త్వరలోనే మీకు తెలుస్తుంది.. కానీ మనసు ఆగదు.. అది తనదైన రాగాన్ని మిమ్మల్ని పాడేలా చేస్తుంది.. జులై 21న ఉదయం 11:33 గంటలకు రాబోతున్నది వేచి ఉండండి’ అంటూ తెలిపారు. అయితే.. ఈ సాంగ్ 'రాకింగ్ స్టార్' యష్, అండ్ తారా సుతారియా మధ్య ఉండనుందని తెలుస్తుండగా.. వీరిద్దరి రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని క్యూరియాసిటీ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ఈసినిమా ఆగస్టు 26న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది.

Next Story