‘వృషకర్మ’ నుంచి షూటింగ్ అప్డేట్.. హీరో, హీరోయిన్ క్యూట్ ఫొటోస్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2026-05-16 12:08:38  IST  )

నాగచైతన్య, డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు కాంబోలో వస్తున్న ‘వృషకర్మ’ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

‘వృషకర్మ’ నుంచి షూటింగ్ అప్డేట్.. హీరో, హీరోయిన్ క్యూట్ ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వృషకర్మ’. ‘తండేల్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చైతు నుంచి వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా ‘విరుపాక్ష’ చిత్రంతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా వృషకర్మ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మేరకు.. ‘వృషకర్మ టీమ్ రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భారతీయ ప్రేక్షకులకు ఇంతకుముందెన్నడూ చూడని మైథాలజికల్ థ్రిల్లర్‌ను అందించేందుకు భారీ స్థాయిలో CGI వర్క్స్ జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే’ అంటూ కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేశారు. ఇందులో షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలతో పాటు హీరో నాగచైతన్య, హీరోయిన్ మీనాక్షి చౌదరి లుక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ భారీ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్పర్శ శ్రీవాత్సవ విలన్‌గా కనిపించనున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డు దిశగా ‘పెద్ది

Next Story