- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డు దిశగా ‘పెద్ది’
ఇప్పటివరకు ‘పెద్ది’ నార్త్ అమెరికా ప్రీమియర్స్‌కు సంబంధించిన 10 వేల టికెట్లు అమ్ముడైనట్లు మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన నార్త్ అమెరికా ప్రీమియర్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన నాటి నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు నార్త్ అమెరికా ప్రీమియర్స్‌కు సంబంధించిన 10 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ సినిమాను జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుండగా, ప్రీమియర్ షోలను జూన్ 3న ప్రదర్శించనున్నారు.
విడుదల తేదీకి ఇంకా సమయం ఉండటంతో పాటు, ఈ మూవీ ట్రైలర్ కూడా ఇంకా విడుదల కాలేదు. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే టికెట్ సేల్స్ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ట్రైలర్ అంచనాలకు మించి ఆకట్టుకుంటే నార్త్ అమెరికాలో ‘పెద్ది’ ప్రీమియర్ బుకింగ్స్ సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.






