- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sekhar Kammula: నాకిష్టమైన నటీనటులు వీరే
తాజా ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల తనకు ఇష్టమైన దర్శకుడు బాపు అని, చిరంజీవి, సావిత్రి అంటే ఎంతో ఇష్టమని తెలిపారు

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన కథలు, సహజమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు మంచి విజయాలను అందుకుని దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. ఇటీవల ధనుష్ హీరోగా రూపొందించిన ‘కుబేర’ సినిమాతో కూడా ఆయన ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ కమ్ముల తనకు ఇష్టమైన దర్శకుడు, నటీనటుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. “నాకు దర్శకుడు బాపు గారు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల ప్రభావం నాపై ఎంతో ఉంది.
ఆయన కథను, పాత్రలను చూపించే విధానం నాకు చాలా నచ్చుతుంది. అందుకే ఆయన దర్శకత్వం అంటే ప్రత్యేకమైన అభిమానం” అని తెలిపారు. అలాగే హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. “చిరంజీవి గారి నటన అద్భుతంగా ఉంటుంది. ఆయన గ్రేస్, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్” అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక తనకు ఇష్టమైన నటి గురించి మాట్లాడుతూ.. “సావిత్రి గారు అంటే చాలా ఇష్టం. ఆమె నటన అసాధారణంగా ఉంటుంది” అని పేర్కొన్నారు. ఇలా శేఖర్ కమ్ముల తాజాగా తనకు నచ్చిన దర్శకుడు, నటీనటుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.






