చిరు టైమింగ్ అదుర్స్.. ఒకేసారి పవన్, బండ్లపై సెటైర్

by Pulgam srinivas |   (  Updated:2026-05-23 06:46:06  IST  )

మెగా 158 పూజ కార్యక్రమంలో భాగంగా పవన్, బండ్ల గణేష్ ఫొటో దిగుతున్న సమయంలో చిరంజీవిని కూడా మధ్యలోకి రావాలని కోరారు దాంతో “దేవుడు, భక్తుడు మధ్యలో నేనెందుకు? దేవుడికి, భక్తుడికి మధ్య అనుసంధానం అయ్యే అంబికా దర్బార్ బత్తీలాంటి వాడిని” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

చిరు టైమింగ్ అదుర్స్.. ఒకేసారి పవన్, బండ్లపై సెటైర్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో తన అద్భుతమైన హాస్యంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే చిరంజీవి, బయట కూడా తనదైన శైలిలో చమత్కారాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. తాజాగా అలాంటి ఓ సరదా సంఘటన ‘మెగా 158’ పూజా కార్యక్రమంలో చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. బండ్ల గణేష్ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌ను తన “దేవుడు”గా పేర్కొంటూ, తాను ఆయన భక్తుడినని చెప్పిన విషయం తెలిసిందే.

పూజా కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ కలిసి ఫొటో దిగుతున్న సమయంలో చిరంజీవిని కూడా మధ్యలోకి రావాలని కోరారు. దీనిపై చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్‌తో స్పందిస్తూ.. “దేవుడు, భక్తుడు మధ్యలో నేనెందుకు? దేవుడికి, భక్తుడికి మధ్య అనుసంధానం అయ్యే అంబికా దర్బార్ బత్తీలాంటి వాడిని” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన కామెడీ టైమింగ్‌కు అభిమానులు ఫిదా అవుతుండగా, ఒకేసారి పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్‌లపై సరదాగా సెటైర్ వేస్తూ నవ్వులు పూయించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Mega 158: ఆ కాలేజీలో స్టార్ట్ అయిన షూటింగ్

Next Story