- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mega 158: ఆ కాలేజీలో స్టార్ట్ అయిన షూటింగ్
హైదరాబాద్ సిటీ కాలేజీలో స్టార్ట్ అయిన ‘మెగా 158’ షూటింగ్.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించనున్న కొత్త సినిమా ఇటీవల ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. టైటిల్ ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ చిత్రాన్ని ప్రస్తుతం ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో లాంచ్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన పూజా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్, మెహర్ రమేష్, బండ్ల గణేష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా ప్రారంభమైనట్లు సమాచారం. హైదరాబాద్‌లోని గవర్నమెంట్ సిటీ కాలేజీలో మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో ‘ఛాంపియన్’ ఫేమ్ అనశ్వర రాజన్ కీలక పాత్రలో కనిపించబోతుంది. చిరంజీవికి కుమార్తె పాత్రలో ఆమె నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా అనశ్వర రాజన్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయినట్లు సమాచారం.
మొదటి నుంచే ఈ పాత్రకు కథలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందనే వార్తలు వస్తుండగా, తొలి షెడ్యూల్‌లోనే ఆమె చేరడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర బృందం ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.






