- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శర్వానంద్-శ్రీను వైట్ల మూవీ రిలీజ్ అయ్యేది అప్పుడే.. పోస్ట్ వైరల్
శర్వానంద్ (Sharwanand), శ్రీనువైట్ల (Srinu Vaitla) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: శర్వానంద్ (Sharwanand), శ్రీనువైట్ల (Srinu Vaitla) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘8 వసంతాల’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్‌ను (Anantika Sanil kumar) హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఏవరేజ్‌గా ఆడింది. దీంతో ఎలాగైనా హిట్ సినిమా తీయాలనే కసి మీదున్నారు. ఈ మేరకు కథ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారట.
తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్న ఇతివృత్తంతో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని, అలాగే ఈ మూవీలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తారని టాక్.
ఇందులో భాగంగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం శర్వానంద్-శ్రీనువైట్ల మూవీ 2027లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అప్పటి వరకు మేకర్స్ కూడా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More..






