'నారీ నారీ నడుమ మురారి'కి యునానిమస్ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: శర్వానంద్

by Sujitha Rachapalli |

చార్మింగ్ స్టార్ శర్వా సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'నారీ నారీ నడుమ మురారి'. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

నారీ నారీ నడుమ మురారికి యునానిమస్ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: శర్వానంద్
X

దిశ, సినిమా : చార్మింగ్ స్టార్ శర్వా సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'నారీ నారీ నడుమ మురారి'. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ మీట్ నిర్వహించారు.

సంక్రాంతి విన్నర్ మీట్ హీరో శర్వా మాట్లాడుతూ... అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. హిట్ కొడతానని చెప్పాను. చెప్పి కొట్టాను. ఇది గర్వంతోనో పొగరుతో మాట్లాడటం లేదు. చాలా హంబుల్ గా చెప్తున్నాను. హిట్టు కొడతానని అంత నమ్మకంగా చెప్పడానికి కారణం ఈ కథ. రామ్, నందు, భాను వాళ్లు రాసిచ్చిన కథ మొదటి రోజు నుంచే నాకు ఎంతో నమ్మకాన్ని కలిగించింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా బ్లాక్ బస్టర్ అవుతుందని అనిల్ గారికి ముందే చెప్పాను. సంక్రాంతి అనేది రెవెన్యూ పరంగా 40, 50% పెరుగుతుంది. నేను కూడా సంక్రాంతికి రావాలనుకున్నాను. దాన్ని నెరవేర్చింది అనిల్ గారే.

రామ్ అబ్బరాజు లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి కావాలి. తను ప్రొడ్యూసర్ డైరెక్టర్. నాకు కథ ఎలా చెప్పాడో అంతకంటే అద్భుతంగా తీశాడు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఆ హిట్ ఇచ్చిన రామ్ కి థాంక్ యూ. భాను నందు అద్భుతంగా రాశారు. ఎక్కడ బోర్ కొట్టించకుండా అద్భుతమైన మాటలు రాశారు. యువరాజ్ చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ చేశారు.

అనిల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో అందరూ కూడా ఆయన్ని మంచి ప్రొడ్యూసర్ అంటారు. ఆయన ఒక బ్రదర్ లాగా నిల్చున్నారు. ఈ సినిమాని ఎంత కష్టపడి తీశారో ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు. మా జర్నీ కొనసాగుతుంది. దిల్ రాజుగారి సపోర్టు నాకు ఎప్పుడు ఉంటుంది. ఆయన తక్కువ థియేటర్లు అని చెప్పారు. మాకు తెలిసే రిలీజ్ చేశాం. మంచి సినిమా ఇచ్చాం, మంచి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వారి చేతుల్లో పెడుతున్నాను వాళ్ళు చూసుకోవాలి. ఇలాంటి గోల్డెన్ హాండ్స్ ఉన్నప్పుడు నాకు ఆలోచించి టెన్షన్ పడాల్సిందేమీ లేదు.

సంయుక్త వండర్ఫుల్ కోస్టార్, తన అందరికీ హిట్స్ ఇస్తుంది అని చెప్తుంటారు. నాకు హిట్ ఇచ్చినందుకు థాంక్యూ( నవ్వుతూ ). సాక్షి వైద్య కూడా చాలా అద్భుతంగా నటించింది. నరేష్ గారు ఈ సినిమాకి మరో హీరో. మా నాన్నగారి క్యారెక్టర్ లో చేశారు. ఆయన సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే విపరీతంగా నవ్వుకునేవాళ్ళం. అందరు కూడా చాలా రోజుల తర్వాత ఇంతలా నవ్వుకున్నామని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇంకా కష్టపడతాను. ఇంకా మంచి సినిమాలు చేస్తాను. ఆ దేవుడే నన్ను ముందుకు తీసుకెళ్తాడని నమ్ముతున్నాను. సంక్రాంతికి అన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి. మన బాస్ సినిమా అద్భుతంగా ఆడుతుంది.అలాగే అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి సినిమా, అలాగే వచ్చిన సినిమాలు అన్నిటికీ ఆల్ ది వెరీ బెస్ట్.

నేను ఎప్పుడు సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు ఆడుతాయి. ఎక్స్ ప్రెస్ రాజా వచ్చినపుడు కూడా అన్ని సినిమాలు ఆడాయి. శతమానం భవతి సమయంలో కూడా అన్ని సినిమాలు ఆడాయి. ఇప్పుడు కూడా అన్ని సినిమాలు ఆడుతున్నాయి. సో.. శర్వా సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు బాగుంటాయి. కచ్చితంగా నా కోసం ఒక స్లాట్ పక్కన పెట్టండి. నెక్స్ట్ సంక్రాంతి మళ్లీ వస్తున్నాను. శ్రీనువైట్ల గారు, మైత్రి మూవీ మేకర్స్ మా కాంబినేషన్ లో నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు

Next Story