‘పెద్ది’ మూవీకి ఎదురుదెబ్బ.. ఆన్‌లైన్‌లో HD ప్రింట్ ప్రత్యక్షం

by Kema Shiva Kumar |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి పైరసీ షాక్ తగిలింది.

‘పెద్ది’ మూవీకి ఎదురుదెబ్బ.. ఆన్‌లైన్‌లో HD ప్రింట్ ప్రత్యక్షం
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ‘పెద్ది’ (Peddi) మూవీ మిక్స్‌డ్ టాక్‌తో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే విడుదలైన రెండో రోజే ఈ సినిమాను సైతం పైరసీ భూతం వదల్లేదు.

ఆన్‌లైన్‌లో హై క్వాలిటీ ప్రింట్లు

అయితే, సాధారణంగా సినిమాలు విడుదలైన కొత్తలో క్యామ్ రికార్డింగ్ (Cam Recordings) ద్వారా వస్తుంటాయి. కానీ ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఏకంగా హైక్వాలిటీ (HQ) ప్రింట్లు అందుబాటులోకి రావడం చిత్ర పరిశ్రమను సైతం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో ఈ చిత్రం డిజిటల్ వసూళ్లపై ఎక్కడ ప్రభావం పడుతుందోనని మెగా అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పైరసీ లింకులు సోషల్ మీడియా (Social Media)లో విచ్చలవిడిగా షేర్ అవుతుండటాన్ని గమనించిన మెగా ఫ్యాన్స్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయా పైరసీ లింకులను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించేలా యాంటీ పైరసీ విభాగానికి సమాచారం ఇస్తున్నారు. అంతేకాకుండా, అంత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం లింకులను లీక్ చేసి, పైరసీకి పాల్పడిన నిందితులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని మూవీ టీమ్‌, పోలీసు యంత్రాంగాన్ని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

Next Story