- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఫీషియల్: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. మొదటి రోజు వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంతంటే?
‘పెద్ది’ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు జూన్ 3 రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో ప్రదర్శించడం ప్రారంభించారు. ప్రీమియర్స్ నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తాజాగా ‘పెద్ది’ మూవీ టీమ్ ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలను అధికారికంగా ప్రకటించింది. మొదటి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు వెల్లడిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.






