- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
US Tariffs: భారత్‌కు భారీ ఊరట..టారిఫ్‌లు 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్‌లు ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదేశాల మేరకు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) సెక్షన్ 301 కింద ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలపై కొత్త టారీఫ్ శ్లాబులను ప్రకటించింది. మొదట భారత్‌పై 12.5 శాతం టారిఫ్ విధించాలని భావించినప్పటికీ, కార్మిక విధానాలు (Labour Practices), ఉత్పత్తుల నిరోధంపై ఇటీవల జరిపిన చర్చల అనంతరం భారత్‌ను తక్కువ పన్ను ఉన్న 10 శాతం కేటగిరీలోకి మార్చారు. ఇండియాతో పాటు కెనడా, బ్రిటన్, మెక్సికో, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి 17 దేశాలకు 10 శాతం టారిఫ్ వర్తించనుంది.
కాగా, వెట్టి చాకిరీ (Forced Labour) ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతిపై నిషేధం అమలు చేయడం, అమెరికాతో జరిపిన చర్చల ఫలితంగా భారత్‌కు ఈ మినహాయింపు దక్కింది. కానీ, ఈయూ (EU), జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ మొదలైన దేశాల ఉత్పత్తులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు పన్నులు విధించారు. 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్లలో బలవంతపు శ్రమను అరికట్టడమే లక్ష్యంగా యుఎస్ టారిఫ్‌లలో మార్పులు చేసింది.






