కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సీజేపీ సుముఖత.. కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నేడు కీలక సమావేశం..?

by Malleboina Mahesh |

విజ్ఞప్తి మేరకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా (తటస్థ వేదిక) వద్ద శుక్రవారం చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాకరోచ్ జనతా పార్టీ (CJP) వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సీజేపీ సుముఖత.. కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నేడు కీలక సమావేశం..?
X

దిశ, వెబ్ డెస్క్: నీట్-యుజి (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ విజ్ఞప్తి మేరకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా (తటస్థ వేదిక) వద్ద శుక్రవారం చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆందోళనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల రద్దు, బాధితుల కుటుంబాలకు పరిహారం అందించడం వంటి తమ ప్రధాన డిమాండ్లను ఈ చర్చల్లో ప్రతిపాదిస్తామని సీజేపీ జాతీయ ముఖ్య ప్రతినిధి సౌరవ్ దాస్, ప్రతినిధి వైష్ణవి గౌర్ వెల్లడించారు.

మరోవైపు 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ల సమక్షంలో మేదాంత ఆస్పత్రిలో తన దీక్షను విరమించారు. దేశంలో హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకే తాను దీక్ష విరమిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని సీజేపీ నేత అభిజీత్ దీప్కే స్వాగతిస్తూ, ఆయన ప్రాణాలు దేశానికి ఎంతో విలువై నవని కొనియాడారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ శాంతియుత ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Next Story