రెండోసారి తండ్రి కాబోతున్న సెన్సేషనల్ డైరెక్టర్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-21 03:59:15  IST  )

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలోకి రాకముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. తొలిసారి ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన 'రాజా రాణి' చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

రెండోసారి తండ్రి కాబోతున్న సెన్సేషనల్ డైరెక్టర్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలోకి రాకముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. తొలిసారి ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన 'రాజా రాణి' చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత విజయ్‌తో తేరి, మెర్సల్, బిగిల్ అంటూ మూడు చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్నాడు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో జవాన్ సినిమాకి దర్శకత్వం వహించి, మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి ఆయన ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా.. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అట్లీ, ఆయన భార్య ప్రియ తాము రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక పోస్ట్ పెట్టారు. ‘మా ఇంట్లోకి మరో చిన్నారి రాకతో మా సంతోషం రెట్టింపు కాబోతోంది.

అవును, మేము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నాం! మీ దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాం. ప్రేమతో… అట్లీ, ప్రియ, మీర్, బెక్కీ, యుకీ, చోకీ, కాఫీ మరియు గూఫీ’ అంటూ అట్లీ ఎక్స్ వేదిక‌గా రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. 2014లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత 2023 జనవరిలో మొదటి సంతానంగా కుమారుడు మీర్ జన్మించాడు. ఇప్పుడు రెండేళ్ల విరామం తర్వాత మళ్ళీ త‌ల్లిదండ్రులం కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.

Read More..

'మన శంకర వరప్రసాద్‌గారు' లో పాట పాడింది ఆ హీరో మేన కోడ‌లా ?

Next Story