- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. కన్నడ నటి వీడియో రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్
బెంగళూరులో సంచలనం చోటుచేసుకుంది. వాష్‌రూమ్‌లో రహస్యంగా వీడియో తీసి, తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కన్నడ టీవీ నటి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాల (Secret Cameras)తో రహస్యంగా వీడియో తీసి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కన్నడ టీవీ నటి (TV Actress), మాజీ రియాలిటీ షో కంటెస్టెంట్ బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు (Bengaluru)లోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో జరిగిన మూడు రోజుల ‘సెలబ్రిటీ ఉమెన్ క్రికెట్ టోర్నమెంట్’ (Celebrity Women's Cricket Tournament) సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 7న ఈవెంట్ రెండో రోజున తాను వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రహస్యంగా వీడియో తీసినట్లుగా బాధిత నటి కంప్లయింట్‌లో పేర్కొన్నారు. నిందితులు ఆ అశ్లీల వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్ నుంచి తన స్నేహితురాలికి పంపారని ఆరోపించారు. ఆపై మరిన్ని ప్రైవేట్ వీడియోలు బయటపెడతామని, తమతో వీడియో కాల్స్ మాట్లాడాలని బెదిరించినట్లుగా పేర్కొన్నారు. మర్యాదగా డబ్బు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని నిందితులు బెదిరింపులకు పాల్పడ్డనట్లుగా బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం
బాధిత నటి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 13న బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ చట్టంతో పాటు బీఎన్ఎస్ యాక్ట్, సెక్షన్లు 77, 351, 308 కింద కేసు నమోదు చేవారు. నిందితులు పంపిన ఫోటోలు, వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను నటి పోలీసులకు అందజేశారు. ప్రస్తుతం ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఎవరిదనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు.
స్టార్‌డమ్ ఊరికే రాలేదు.. ఆఫీసుల చుట్టూ తిరిగితేనే ఈ స్థాయి దక్కింది.. మృణాల్ షాకింగ్ కామెంట్స్






