- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్‌డమ్ ఊరికే రాలేదు.. ఆఫీసుల చుట్టూ తిరిగితేనే ఈ స్థాయి దక్కింది.. మృణాల్ షాకింగ్ కామెంట్స్
సార్, నేను ఇక్కడే ఉన్నాను, ప్లీజ్ ఏదో ఒక రోజు నాకు అవకాశం ఇవ్వండి.

దిశ, సినిమా: నేడు సౌత్ నుంచి నార్త్ వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), ఈ స్థాయికి చేరుకోవడానికి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. 'సీతారామం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ అందుకున్న ఈ భామ, తన కెరీర్ ఆరంభంలో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినీ నేపథ్యం లేని తనకు అవకాశాలు అంత తేలికగా రాలేదని, పని కోసం తాను పడ్డ తపనను ఆమె వివరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టే క్రమంలో మృణాల్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించింది. ‘‘నేను అవకాశాల కోసం దర్శకుల ఆఫీసుల చుట్టూ తిరిగేదాన్ని.
వాళ్ళు నన్ను గమనించేలా చేసుకుని.. 'సార్, నేను ఇక్కడే ఉన్నాను, ప్లీజ్ ఏదో ఒక రోజు నాకు అవకాశం ఇవ్వండి' అని బతిమలాడుకునేదాన్ని" అంటూ ఆనాటి రోజులను మృణాల్ గుర్తు చేసుకున్నారు. పని అడగడానికి ఎప్పుడూ మొహమాటపడకూడదని, మనలోని ఆకలి దర్శకులకు తెలిసినప్పుడే వాళ్ళు మనకు బలమైన పాత్రలు ఇస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరుస హిట్స్ అందుకుంటున్నా.. మృణాల్ తన పద్ధతిని మార్చుకోలేదట. తనకు నచ్చిన దర్శకులకు ఇప్పటికీ వ్యక్తిగతంగా మెసేజ్ చేయడం లేదా ఫోన్ చేసి కనెక్ట్ అవ్వడం వంటివి చేస్తూనే ఉంటానని ఆమె తెలిపారు.
ఒక నటిగా తన వంతు కృషిని 100 శాతం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఆ ధైర్యమే తనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ‘దో దివానే షెహర్ మే’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్న మృణాల్ ఈ అవకాశం కోసం కూడా అదే ఫాలో అయినట్లు తెలిపారు. ‘‘రవి సర్ తీసిన 'మామ్' సినిమా చూశాక ఆయనతో పని చేయాలని ఫిక్స్ అయ్యాను. నేనే నేరుగా వెళ్లి.. సర్, మనం నెక్ట్స్ సినిమా ఎప్పుడు చేస్తున్నాం? అని అడిగేశాను" అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.కాగా.. ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తుండగా.. సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారడంతో అంతా షాక్ అవుతున్నారు.






