ఇప్పుడు అంతా ఆమె వంతు.. సెకండ్ లుక్‌తో మూవీపై భారీ హైప్

by Chukka Sudharani |   (  Updated:2026-05-01 01:26:45  IST  )

కీర్తి సురేష్ నటిస్తున్న ‘సత్యవాన్ సావిత్రి’ నుంచి సెకండ్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మూవీపై అంచనాలు రెట్టింపు చేశారు మేకర్స్.

ఇప్పుడు అంతా ఆమె వంతు.. సెకండ్ లుక్‌తో మూవీపై భారీ హైప్
X

దిశ, సినిమా: పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్లు అందుకుంటున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం ఓ క్రేజియస్ట్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి ‘సత్యవాన్ సావిత్రి’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ‘ప్రశాంతమైన ముఖం.. అజేయమైన శక్తి.. ఇప్పుడు అంతా ఆమె వంతు’ అంటూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యగా సూపర్ రెస్పాన్స్ దక్కింది. అలాగే.. సెంకడ్ లుక్ అంటూ మరో సాయంత్రానికి సినిమాలోని సీన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు పంచుకోగా.. ప్రజెంట్ అవి నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తున్నారు.. కాగా.. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు మిస్కిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రవీణ్, విజయ్ దర్శకత్వం వహిస్తుండగా, అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించే సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. జీ స్టూడియోస్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతుంది.

‘బేబీ’ బ్యూటీ కి అలాంటి ప్రశ్న.. అసహనం వ్యక్తం చేసిన హీరోయిన్

Next Story