- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బేబీ’ బ్యూటీ కి అలాంటి ప్రశ్న.. అసహనం వ్యక్తం చేసిన హీరోయిన్
‘బేబీ’తో బ్లాక్ బస్టర్ అందుకున్న జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న సినిమా ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’.

దిశ, సినిమా: ‘బేబీ’తో బ్లాక్ బస్టర్ అందుకున్న జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న సినిమా ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. 90s: ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ఓ విలేకరి.. బేబీ సినిమాలో వైష్ణవి పాత్రను గుర్తు చేస్తూ ‘బేబీ తర్వాత ఇమేజ్ చేంజ్‌ఓవర్ అవసరమైంది కదా.. ఎపిక్‌తో అది సాధ్యం అవుతుందా’ అని ప్రశ్నించగా.. వైష్ణవి కాస్త అసౌకర్యంగా ఫీల్ అయింది. ఆన్సర్ చేసేందుకు ఇబ్బంది పడగా.. ఇంతలో ఆనంద్ మైక్ తీసుకుని ‘సినిమాలోని క్యారెక్టర్‌ని బట్టి ఉంటుంది.
అంతేగానీ కెరీర్ అంతా ఒక ఇమేజ్‌ను కొనసాగించలేం. బేబీలో ఆమె నటనను అందరు మెచ్చుకున్నారు. ‘ఎపిక్’లోనూ బలమైన పాత్ర పోషిస్తోంది. స్ట్రాంగ్ ఫిమేల్ రోల్స్ ఉన్న సినిమాలు ఏడాదికి ఒకటో, రెండో రావడం కష్టం.. అలాంటిది ఆమెకు మూడేళ్ల వ్యవధిలోనే రెండు వచ్చాయి.. నటి అవ్వడం కోసమే ఆమె పుట్టింది’ అంటూ వైష్ణవిపై ప్రశంసలు కురిపించాడు ఆనంద్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ‘ఇంటర్వ్యూలు లేదా ప్రమోషనల్ ఈవెంట్లలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా.. వృత్తిపరమైన విషయాలను పక్కనపెట్టి, కేవలం క్లిక్-బైట్ కోసం లేదా ఇబ్బంది పెట్టేలా కాలాలని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారు’ అని నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.






