- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సత్యదేవ్ 'రావు బహదూర్' విడుదల తేదీ లాక్
రావు బహుదూర్ చిత్రాన్ని ఈ సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రావు బహదూర్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర బృందం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రం ట్రైలర్ విడుదలై అది కూడా ఆకట్టుకునే విధంగా ఉంటే సినిమాపై అంచనాలు మరింత తారస్థాయికి చేరుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రంలో దీప థామస్ హీరోయిన్‌గా నటిస్తోంది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ (మహేష్ బాబు సమర్పణలో), శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్లాజ్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు.






