- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న మెగా డాటర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘రాకాస’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
మొత్తంగా రూ. 27 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి, బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలను మిగిల్చింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రావడానికి సిద్ధమైంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్-నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ హిట్ చిత్రం ‘రాకాస’. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన రెండో ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఓటీటీ సిరీస్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు మానస శర్మ ఈ చిత్రాన్ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘రాకాస’ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను వంటి సీనియర్ నటుల కామెడీ టైమింగ్, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి వంటి హేమాహేమీల నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. మొత్తంగా రూ. 27 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి, బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలను మిగిల్చింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రావడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘రాకాస’ స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతుండటం విశేషం. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్ళీ చూడాలనుకునే వారు ఈ సమ్మర్ హాలిడేస్‌లో ‘రాకాస’ను ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు.






