- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధురంధర్ 2 సక్సెస్.. సారా అర్జున్ ఎమోషనల్ పోస్ట్
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని కలెక్షన్స్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది.

దిశ, సినిమా: ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని కలెక్షన్స్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం తాజాగా భారత బాక్సాఫీస్ వద్ద ₹1000 కోట్లు వసూలు చేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాపై సక్సెస్‌పై తాజాగా సారా అర్జున్ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ‘నేను ఆదిత్య సార్‌ను మొదటిసారి కలిసినప్పుడు, ఆయన కళ్లలో ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపించింది. ఆయన సినిమా కోసం ఏదో అద్భుతం చేస్తారని నాకు అర్థమైంది. ఈ ప్రయాణంలోని ప్రతి అడుగులో నేను ఆ అద్భుతాన్ని గ్రహిస్తూనే ఉన్నాను. అలాగే.. ఈ ప్రయాణంలో మనమందరం గమనించని శక్తులు, ఫ్రేమ్ బయట నిలబడిన అసంఖ్యాకమైన వ్యక్తులు ఈ సక్సెస్‌కు ఒక కారణం. దీంతో పాటు ఈ నౌకకు సారథి అయిన ఆదిత్య ధర్, ఆయన దర్శకత్వ బృందానికి, ఈ కలను ఇంత అద్భుతంగా తెరపైకి తీసుకురావడానికి అవిశ్రాంతంగా పనిచేసిన వారికి, మేము వెలుగులో నిలబడటానికి తుఫానులను తట్టుకున్న నిర్మాతలకు, నిర్మాణ బృందానికి అందరికి ఈ సక్సెస్ అంకితం. ఇంతటి ఆదరణ ఇస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ తెలిపింది సారా.






