- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘డెకాయిట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
‘డెకాయిట్’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన జేయన్ మేరీ ఖాన్ మరెవరో కాదు, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనకోడలు, ప్రముఖ దర్శకుడు మన్సూర్ ఖాన్ కుమార్తె.

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా సినిమాలో ఒక నటి అద్భుతమైన ప్రదర్శన కనబరిస్తే, ఆ చిత్రం విడుదలైన తర్వాత ఆమెకు మంచి పాపులారిటీ రావడం సాధారణంగా జరిగే విషయమే. అయితే కొన్ని సందర్భాల్లో సినిమా విడుదలకు ముందే అందాల ఆరబోతతో కూడా కొంతమంది బ్యూటీలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు.
అడవి శేష్ హీరోగా, మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ‘డెకాయిట్’ చిత్రం ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తూ ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జేయన్ మేరీ ఖాన్ కూడా హాజరయ్యింది.
ఈ ఈవెంట్‌కు జేయన్ మేరీ ఖాన్ సిల్వర్ కలర్ శారీతో పాటు స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి హాట్ లుక్‌లో మెరిసింది. ఆమె హాజరైన వెంటనే ఈవెంట్‌లోని కెమెరాలన్నీ ఆమె వైపే తిరిగాయి. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ బ్యూటీ ఎవరు అనే ఆసక్తి చాలామందిలో కనిపిస్తోంది. జేయన్ మేరీ ఖాన్ మరెవరో కాదు, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనకోడలు, ప్రముఖ దర్శకుడు మన్సూర్ ఖాన్ కుమార్తె. ఇప్పటికే ఈమె పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటించి హిందీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
‘డెకాయిట్’ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తే, జేయన్ మేరీ ఖాన్‌కు తెలుగులో కూడా మంచి అవకాశాలు రావడంతో పాటు సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






