సమంత ‘మా ఇంటిబంగారం’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

by Chukka Sudharani |   (  Updated:2026-05-06 15:54:02  IST  )

స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న మా ఇంటిబంగారం చిత్రం రిలీజ్ వాయిదా పడింది. కొత్త రిలీజ్‌పై కూడా అప్డేట్ వచ్చింది.

సమంత ‘మా ఇంటిబంగారం’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై రెండో చిత్రంగా రాబోతున్న ఈ మూవీకి నందిని దర్శకత్వం వహిస్తుంది. ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్స్ తర్వాత దర్శకురాలు నందిని, సమంత కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మా ఇంటి బంగారం చిత్రం మే 15న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వగా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా.. విడుదల సమయం దగ్గర పడుతున్న ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో వాయిదా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు నిజంగానే ఈ సినిమా వాయిదా పడిందని కన్ఫర్మ్ అయింది. ఈ మేరకు టీమ్ నుంచి అందుకున్న సమాచారం ప్రకారం.. మా ఇంటిబంగారం చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారని తెలిపారు. అలాగే దీనిపై మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రాన్ని సామ్ భర్త రాజ్ నిడిమోరు నిర్మిస్తుండటం విశేషం. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

Read more...NTRNeel: లేటెస్ట్ షూటింగ్ అప్డేట్

Next Story