- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTRNeel: లేటెస్ట్ షూటింగ్ అప్డేట్
ప్రస్తుతం "NTRNeel" మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా అధికారిక టైటిల్ ప్రకటించలేదు. దీంతో చిత్ర యూనిట్ "NTRNeel" అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్‌ను కొనసాగిస్తోంది. అయితే, ఈ చిత్రానికి "డ్రాగన్" అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన తాజా షూటింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనడం లేదని సమాచారం. ఈ సినిమాను 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ తేదీని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదనే ఉద్దేశంతో దర్శకుడు దేవా కట్టా కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనుంది.






