- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది: ఓవర్సీస్ బుకింగ్స్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
పెద్ది: నార్త్ అమెరికా టికెట్ బుకింగ్స్‌ను మే 7వ తేదీ నుంచి ఓపెన్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికా టికెట్ బుకింగ్స్‌ను ముందుగానే ఓపెన్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ మే 7వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయని ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. నార్త్ అమెరికా ప్రేక్షకుల కోసం బుకింగ్స్ టైమింగ్స్‌ను కూడా స్పష్టంగా ప్రకటించారు. ఈస్ట్ కోస్ట్‌లో రాత్రి 8 గంటలకు (EST), సెంట్రల్ టైమ్ ప్రకారం 7 గంటలకు (CST), పసిఫిక్ టైమ్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు (PST) బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇక ఈ సినిమా బుకింగ్స్ కి నార్త్ అమెరికాలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యాంధు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.






