- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హ్యాపీ బర్త్ డే డియర్ అంటూ ఆ స్టార్ హీరో భార్యకు స్పెషల్ విష్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు.
కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది.
కాగా రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది.
అందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్(Alia Bhat)కు హ్యాపీ బర్త్‌డే డియర్ అని స్పెషల్ విషెస్ తెలిపింది. దీంతో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbeer Kapoor)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి ప్రేమకు గుర్తుగా వీరికి రాహా అనే పాప కూడా జన్మించింది. అయితే సమంత, అలియా మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే.
Read More..
మరిదికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన నేషనల్ క్రష్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే(పోస్ట్)






