మరిదికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన నేషనల్ క్రష్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే(పోస్ట్)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-16 03:33:13  IST  )

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరిదికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన నేషనల్ క్రష్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఇక ‘పుష్ప’(Pushpa) మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే ఫేమ్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ‘యానిమల్’(Animal) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అలాగే రీసెంట్‌గా ‘ఛావా’(Chhaava) మూవీతో కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం హీరోయిన్లలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా రష్మిక మందన్న తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda)కు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆనందా అని విషెస్ తెలిపింది. అలాగే అతని మంచి ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మరిదికి స్పెషల్ విష్ చేసిన వదినమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Read More..

Ruhani Sharma: ఢిపరెంట్ లుక్‌లో దర్శనమిచ్చిన రుహానీ శర్మ..



Next Story