Ruhani Sharma: ఢిపరెంట్ లుక్‌లో దర్శనమిచ్చిన రుహానీ శర్మ..

by Kodari Anjali |   (  Updated:2025-03-16 03:32:14  IST  )

బ్యూటీ రుహాని శర్మ (Ruhani Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Ruhani Sharma: ఢిపరెంట్ లుక్‌లో దర్శనమిచ్చిన రుహానీ శర్మ..
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీ రుహాని శర్మ (Ruhani Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తమిళ చిత్రం బెంచ్ కార్తీ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత చి. లా. సౌ చిత్రంలో అవకాశం దక్కించుకుని.. అందులో ప్రధాన పాత్రలో నటించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుందని చెప్పుకోవచ్చు.

తర్వాత రుహాని శర్మ HIT: ది ఫస్ట్ కేస్, నూటోక్క జిల్లాల అందగాడు వంటి చిత్రాలలో నటించింది . 2019 లో ఆమె కమలతో మలయాళంలో అరంగేట్రం చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రుహాని పంజాబీ మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించి జనాల్ని అలరించింది.

తెలుగు సంకలన చిత్రం మీట్ క్యూట్‌లో అవకాశం కొట్టేసింది. తర్వాత ఆగ్రా అనే మూవీతో హిందీలోకి అడుగుపెట్టింది. వీటితో పాటు ఈమె డర్టీ హరి, మె - అధ్యాయం 1, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగ నీతులు, నన్ను ప్రేమించు, బ్లాక్అవుట్ వంటి చిత్రాల్లో నటించి తనదైన సత్తా చాటింది.

టాలీవుడ్‌లో ఆడదాపాడదా సినిమాల్లో నటిస్తూన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరచూ స్టన్నింగ్ ఫొటో షూట్లు చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది. సినిమాలు హిట్ అయినా కాకపోయినా నెట్టింట అందాల వర్షం కురిపిస్తుంటుంది ఈ వయ్యారి భామ. రెగ్యులర్‌గా క్రేజీ ఫొటోలకు ఫోజులిస్తుంటుంది.

తన అందచందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుందనడంలో అతిశయోక్తిలేదు. ఒక్కోసారి సంప్రదాయ దుస్తుల్లో దర్శనమివ్వగా.. ఒక్కోసారి హీట్ పుట్టించే దుస్తుల్లో కనిపిస్తుంటుంది. అయితే తాజా రుహాని శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో తను డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ పిక్స్ కు ‘మోనోక్రోమ్ మ్యాజిక్’ అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.

Read More..

హ్యాపీ బర్త్ డే డియర్ అంటూ ఆ స్టార్ హీరో భార్యకు స్పెషల్ విష్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్


Next Story