- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమంత ఈజ్ బ్యాక్.. యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టిన ‘మా ఇంటి బంగారం’
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) అనే సినిమాలో నటిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య, కన్నడ స్టార్ హీరో దిగంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక దీనికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌లో.. ఎట్లా ఇక్కడి వరకు వచ్చాము కదా.. ఉండిపోదాం అని సమంత చెప్పే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆమె భర్త అత్తగారిల్లు ఇంకోసారి బాగా ఆలోచించుకో అని అంటాడు.. అప్పుడు సామ్.. అందరూ ఎంతో మంచి వాళ్ల లాగా ఉన్నారు.. నాకు చూస్తాంటే ఎప్పటినుంచో తెలిసినట్టుంది.. నువ్వు చూస్తా ఉండు వారం రోజుల్లో ఫుల్లుగా కలిసిపోతాం అందరం అని చెప్తుంది.
ఆ తర్వాత వచ్చే సామ్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బేసిక్‌గా ఆమె నుంచి కనిపించే గ్లామర్‌కు భిన్నంగా, పవర్‌ఫుల్ యాక్షన్ క్యారెక్టర్‌లో సమంత కనిపించడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. టైటిల్ వినడానికి ఫ్యామిలీ టచ్ ఉన్నట్లు అనిపించినా, సినిమా మాత్రం పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు అర్ధమవుతుంది. ఫైనల్‌గా టీజర్ చూసిన నెటిజన్లు సమంత ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
మా బంగారం.. మీలో కలిసిపోతుంది.. మరోసారి వైరల్ అయిపోతున్న సమంత






